Header Banner

టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు! ఆ ఉద్యోగుల బదిలీలకు సన్నాహాలు!

  Tue May 20, 2025 18:28        Others

టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. స్విమ్స్ ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయటంతో పాటుగా టీటీడీ ఉద్యోగుల పదోన్నతుల పైనా చర్చ చేసారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభించనున్నారు. ఇక, తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని డిసైడ్ అయ్యారు.


తిరుమలలో పచ్చదనం

టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామల రావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027 -28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ⁠తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.


ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

పేర్లు మార్పు

⁠తిరుమ‌ల‌లోని విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌లేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేయాల‌ని నిర్ణ‌యం. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ⁠ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. ⁠రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి కి ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపారు.


సిబ్బంది నియామకం స్విమ్స్ మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించేంద‌కు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సు లు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం. అదేవిధంగా 85శాతం నిర్మాణా లు పూర్తి చేసుకున్న భ‌వంతుల‌ను (ఆంకాల‌జీ మ‌రియు ప‌ద్మావ‌తి చిన్ని పిల్ల‌ల ఆసుప‌త్రిల‌తో క‌లిపి) త్వ‌ర‌లోనే మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణ‌యం. శ్రీ‌వారి వైద్య సేవ‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకు న్నారు. ⁠టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు, స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. ⁠తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు. ⁠ఒంటిమిట్ట‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం సేవ‌ల‌ను మరింత పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అమరావతి ఆలయం అభివృద్ధి కోసం ర చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయింపుకు ఆమోదించారు. ⁠శ్రీ‌వారి నామావళిని రీమిక్స్ చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌ డీడీ నెక్ట్స్ లెవ‌ల్ చిత్ర బృందం పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.


ఇది కూడా చదవండి: ఆర్టీసీ డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..! అర్హతలు ఇవే..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రమోషన్‌తో పాటుగా నెలకు జీతం పెంపు..!

 

మహానాడు కోసం భారీ ఏర్పాట్లు! కీలక నేతల ఆధ్వర్యంలో 19 కమిటీలు!

 

చంద్రబాబు కీలక ప్రకటన.. అధికారుల గుండెల్లో గుబులు! జూన్ 12 తర్వాత ఎప్పుడైనా..

 

తల్లికి వందనం పై లేటెస్ట్ అప్డేట్! కొత్త నిబంధనలతో... అర్హులు వీరే!

 

మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు టీచర్లకు ఊరట..! కీలక ఉత్తర్వులు జారీ..!

 

విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు! 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTDDecisions #TirumalaUpdates #TTDBoardMeeting #TirumalaSecrets